పిఠాపురం: ప్రాణం ఉన్నంత వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే ఉంటానని చెప్పారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన బాలినేని…నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డిగారు. నాకు రాజశేఖరెడ్డి అన్నా, ఎన్టీఆర్ అన్నా ఇష్టమని చెప్పారు. “పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతాను… జగన్ పార్టీ పెడితే నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. నాలుగేళ్లు పదవి గడువు ఉన్నా వదిలేసి జగన్ వెంట ఉన్నా.. మంత్రి పదవి తీసేసినా సహించాను. చాలా అవమానించారు. ఎంతో నష్టపోయాను. ఆస్తులు కోల్పోయాను. నాతోపాటు ఎమ్మెల్యేలందరి పైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. రఘురామకృష్ణంరాజు నిన్ను తిట్టినందుకు లోపల వేసి కొట్టించారు..మరి పోసాని పవన్ తిట్టాడు.. చంద్రబాబు ఫ్యామిలీని తిట్టారు.. ఏం చేయాలి? అని ప్రశ్నించారు బాలినేని. పవన్ గతంలో అన్నారు.. బాలినేని లాంటి మంచివాళ్లు వైసీపీలో ఉన్నారని చెప్పినప్పుడు నేను పార్టీలో చేరాల్సింది.. అదే నేను చేసిన తప్పు.. చిన్న చిన్న వాళ్లను లోపల వేయడం కాదు.. కోట్లు సంపాదించారు.. స్కాంలు చేశారు. అలాంటి వాళ్లు ప్రభుత్వం లోపల వేయాలి.. మీ నాన్న దయతో నువ్వు సీఎం అయ్యావు.. లేకపోతే నువ్వు అయ్యేవాడివా? అని ప్రశ్నించారు. పవన్ ని నేను పదవులివ్వని కోరలేదు.. నాతో సినిమా తీయమని మాత్రమే కోరాను. పవన్ పైకి ఎదగడమే నా కోరిక” అని చెప్పారు బాలినేని శ్రీనివాసరెడ్డి. నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను.. రెండు సార్లు మంత్రి అయ్యాను.. నాకు అది చాలు. నాకు అవకాశం ఇస్తే.. ప్రకాశం జిల్లాలో అందరినీ జనసేనలో చేర్పిస్తాను.. నాకు చాలా అన్యాయం చేశారు.. నేను అన్నీ చెబుతాను అంటూ స్టేజీపైనే భావోగ్వేగానికి లోనయ్యారు బాలినేని.