HomeAndhra PradeshJANASENA PARTY: "భజన"సేనగా పవన్ పార్టీ..!

JANASENA PARTY: “భజన”సేనగా పవన్ పార్టీ..!

Published on

spot_img

* అవకాశవాదిగా మారిన పవన్ కల్యాణ్..

* గతంలో కమ్యూనిజం, సోషలిజం అంటూ బిల్డప్

* ఇప్పుడు సనాతన ధర్మమంటూ భిన్నస్వరం

* ఉత్తరాది ఆధిపత్యంపై నోరుమెదపని పవన్

* ఆఖరికి పుట్టుక, చదువు, మతంపై రంగులు మార్చిన జనసేనాని

* విలువలు, విశ్వసనీయతను కోల్పోయిన పవన్

* పవన్ కల్యాణ్ తీరుపై సర్వత్రా విమర్శలు

– బళ్ల రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

అసలు ఆ పార్టీ పుట్టిందే పక్క పార్టీలకు భజన చేయడానికా..? ప్రజల కోసం పనిచేయడానికా..? ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా పార్టీ జెండాలు మారుస్తూ పచ్చి అవకాశవాదిగా పవన్ మారాడా..? అంటే అవుననే అంటున్నారు పలువురు మేథావులు… పవన్ కల్యాణ్ పుట్టుక నుంచి మొదలుపెడితే.. చదువు, మతం, కులం ఏది చూసినా అబద్దాలే. చెప్పే మాటకు చేసే పనికీ పొంతన లేదు. కుటుంబ పాలనకు, కులాలకు వ్యతిరేకం అన్న వ్యక్తే నేడు ఆ మాటను మర్చిపోయి ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పార్టీ పుట్టి పుష్కర కాలం గడుస్తున్నా… దశ-దిశ లేకుండా “భజన”సేనగా మిగిలిపోయింది.

పవన్ కళ్యాణ్… ఆయన ఓ అవకాశవాది. సిద్ధాంతాలు మారుస్తూ.. కొత్త కొత్త జెండాలు మోస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓ వైపు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నానని చెబుతూనే, మరోవైపు చర్చిలో బాప్తిస్మం తీసుకున్నానని చెప్పడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వేషాలు వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పుట్టుక నుంచి పవన్ కల్యాణ్ సనాతన వాది కాదు. మొన్నటి వరకూ నేను బీఫ్ తిన్నాను.. మా నాన్న బీఫ్ తిన్నాడు. అన్నాడు కదా.. మరి సనాతన వాది బీఫ్ తింటాడా? ముస్లిం వేషం వేస్తాడా…? జోర్డాన్ లో చర్చికి వెళ్లి నేను బాప్తిస్మం పొందాను అన్నాడు… పుట్టుకతోనే సనాతన వాదివి అయితే బాప్తిస్మం ఎలా తీసుకుంటాడు..? అంటే అన్నీ అబద్ధాలే..

తాను కమ్యూనిస్టుని, సోషలిస్టుని, అంబేద్కర్, పూలే నాకు ఆదర్శం…, కులం లేదు.. మతం లేదు అని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్.. తనది సెక్యులర్ పార్టీ అన్నట్టుగా జనాన్ని నమ్మించాడు. చెగువేరా వారసుడిని నేనే అన్నట్టుగా వ్యవహరించిన పనవ్.. ఎర్రజెండాలు, నీలి జెండాలు భుజాన వేసుకుని ప్రగల్భాలు పలికాడు. పవన్ అరుపులకు, కేకలకు నమ్మిన జనం..సెక్యులర్ పార్టీ అని ఓట్లేసి మోసపోయారు. పార్టీ పుట్టిన పుష్కర కాలంలో ఒక సిద్ధాంతం లేదు. మాట మీద నిలకడ లేదు. పొంతనలేని, నిలకడలేని మాటలెన్నో చెప్పిన పవన్.. ఇప్పుడు జనం దృష్టిలో పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయాడు.

ఇక ఎన్నికలకు ముందు ఆడపిల్లల గురించి, సుగాలి ప్రీతి గురించి పదే పదే మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు..? వాలంటీర్లకు 10 వేలు ఇస్తామన్న పవన్.. అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థను ఎందుకు నిర్వీర్యం చేశారు.? కుటుంబ పాలనకు వ్యతిరేకమన్న పవన్.. ఎమ్మెల్సీగా అన్న నాగబాబుకు ఎందుకు పదవి కట్టబెట్టారు..? కూటమిలో ఉన్న “భజన”సేన పార్టీకి మూడు మంత్రి పదవులొస్తే.. రెండు కాపులకు ఇచ్చి మిగిలిన కులాలకు ఏం సంకేతం ఇచ్చారు..? అసలు ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన మాటలేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? నేను లెఫ్టిస్టుని అని చెప్పిన ఆ మనిషే.. ఇప్పుడు రైటిస్టునంటుంటే ఎవరు నమ్ముతారు..?

ఉత్తరాది అహంకారం మీదే నా పోరాటం అని చెప్పాడు.. ఇప్పుడెందుకు మాటమార్చాడు..? డీలిమిటేషన్ పై ఎందుకు స్పందించడం లేదు..? అంటే ఆయనకు కావాల్సింది కేవలం అధికారం మాత్రమే. అధికారం కోసం ఏ పార్టీ జెండా అయినా మోస్తాడని తేలిపోయింది. దీంతో పూటకో మాట, రోజుకో వేషం వేస్తున్న పవన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని యువత, పేద వర్గాల ప్రజలు కూడా ఇకనైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిస్టర్ పవన్ కల్యాణ్…ఇది సినిమా కాదు.. ప్రజాజీవితం. ప్రజల జీవితాలతో ఆటలాడొద్దు..పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం కాదు.. ముందు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...