ED RAIDS IN GOLD SMUGGLING CASE INVOLVING RANYARAO AND OTHERS
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు..సంచలనం రేపుతోంది. అంతేకాకుండా ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం సీఐడీ దర్యాప్తును ఉపసంహరించుకోవడంతో..హాట్ టాపిక్ గా మారింది. దీనిపై విమర్శలు చేలరేగడంతో..కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. సీఐడీ దర్యాప్తును ఉపసంహరించుకోవడంలో..ఎలాంటి ఒత్తిడి లేదని తేల్చి చెప్పారు. రన్యారావు తండ్రి రామచంద్రరావు IPS అధికారి కావడంతో ఈ కేసును డీపీఏఆర్ విభాగంతో దర్యాప్తు చేయించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఒకేసారి 2 దర్యాప్తులు అనవసరమని గుర్తించి.. సీఐడీని తప్పించినట్లు హోం మంత్రి స్పష్టం చేశారు.
రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ED సైతం దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. బెంగళూరు సహా అనేక చోట్ల తనిఖీలు చేస్తున్నారు. మొత్తం నగరంలో 8 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూలో ఇప్పటికే సీబీఐ కూడా రంగంలోకి దిగి..దర్యాప్తు ముమ్మరం చేసింది. స్మగ్లింగ్ లో రన్యా రావుతో పాటు మరికొందరి పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సాక్ష్యాలను వెలికితీసేందుకు సీబీఐ, డీఆర్ఐలతో సమన్వయం చేసుకుంటున్న ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద ఇటీవల కేసు నమోదు చేసింది.