HomeTelanganaTELANGANA : మీనాక్షి నటరాజన్ ఫార్ములా వర్కవుట్ అయ్యేనా?

TELANGANA : మీనాక్షి నటరాజన్ ఫార్ములా వర్కవుట్ అయ్యేనా?

Published on

spot_img

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, పార్టీ కేడర్ ను గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన ఫార్ములా వర్కవుట్ అవుతుందా..? ముఖ్యంగా గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువనో లేక మరే ఇతర కారణాలతోనో నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ విమర్శలు చేయడంతోపాటు సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్టను బజారు కీడుస్తున్నారు. ఇకపై ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు, నేతల అసమ్మతిని లేకుండా చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అదిరిపోయే స్కెచ్ వేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీని మూడు గ్రూపులుగా విభజించి సరికొత్త రాజకీయానికి నాంది పలికారు.

ఏఐసీసీ దూత మీనాక్షి నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చూడటానికి ఎంత సింపుల్‌గా ఉంటారో పార్టీ బలోపేతం విషయంలో అంతే స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తారు. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలు ఎంత కష్టంతో కూడుకున్నవైనా సరే అంతు తేల్చకుండా ఉండరు. తెలంగాణ ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పర్యటిస్తూ… పార్టీలో గ్రూపులు, నేతల మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించారు. ఇకపై పార్టీలో ఇలాంటి పరిస్థితులు రాకూడదని భావించిన మీనాక్షి నటరాజన్… తనదైన వర్క్ స్టైల్‌తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరుసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు అంతా కలిసికట్టుగా ఉండేలా అందర్నీ ఒకేతాటిపైకి తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా గత కొంత కాలంగా హస్తం పార్టీకి తలనొప్పిగా మారిన కొత్త, పాత నేతల మధ్య సమన్వయలోపంకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సరికొత్త ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. త్రీ గ్రూప్ ఫార్ములాను అప్లై చేసి సమన్వయ లోపానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని మూడు గ్రూపులుగా ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ విభజించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్లు ఒక గ్రూప్ గా, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మరొక గ్రూప్ గా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కండువా కప్పుకున్న వారిని మరో గ్రూపు‌గా విభజించాలని మీనాక్షి నటరాజన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ కేటగిరిల వారీగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నేతల మధ్య ఎలాంటి అంతరాయం ఏర్పడదని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలంగాణలో మీనాక్షి నటరాజన్ చేపడుతున్న ఈ పార్ములా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...