అమరావతి: ఏపీ శాసన మండలిలో ఇవాళ అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో విధ్వంసం అని పదే పదే అంటున్నారని, అవేంటో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్టయితే విచారణ జరిపించాలన్నారు. బొత్స వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడటం లేదన్నారు. ఈ సందర్భంగా బొత్స, అచ్చెన్నాయుడు మధ్య సభలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. దీంతో కొంచెం సేపు గందరగోళం నెలకొంది.