HomeAndhra PradeshAP Cabinet : కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

AP Cabinet : కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

Published on

spot_img

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన రెండు పనులకు కూడా ఆమోదముద్ర వేసింది. మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఅవుట్‌ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకు కట్టబెట్టినట్లైంది.

వెలగపూడిలోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు, ఎస్‌ఐపీబీ అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది.

Latest articles

Maoists : చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం

* జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోలు * ప్రాణాలు కోల్పోయిన 9 మంది జవాన్లు గత కొన్ని నెలలుగా భద్రతాబలగాల...

Allu Arjun: అల్లు అర్జున్ కు భారీ ఊరట… రెగ్యులర్ బెయిల్ మంజూరు

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన...

Telangana : సహ విద్యార్థినికి విషెస్ చెప్పినందుకు దాడి…మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తోటి విద్యార్థినికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని ఆగ్రహించిని అమ్మాయి...

Dr.Mallu Ravi: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు సరికాదు..!

* రాహుల్ ప్రధాని కావడం ఖాయం * నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి హైదరాబాద్ : మాజీ కేంద్ర...

More like this