HomeNationalWayanad byelection: వయనాడ్ లో ప్రియాంక గెలుపు..

Wayanad byelection: వయనాడ్ లో ప్రియాంక గెలుపు..

Published on

spot_img

* తొలి అడుగులోనే విజయభేరి..

* ప్రత్యర్థిపై 4.04లక్షలకు పైగా ఓట్ల మెజార్టీ

వయనాడ్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని ఆమె దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థిపై 4.04 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్ పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్ బరేలీలోనూ గెలవడంతో ఆ తర్వాత ఈ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఝార్ఖండ్ తొలి విడత ఎన్నికలతోపాటుగా ఈ నెల 13న ఈ స్థానంలో పోలింగ్ జరిగింది.

అయితే, వయానాడ్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఈ సారే పోలింగ్ శాతం అత్యల్పంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ శాతం 72.82 ఉండగా, ఈ ఉప ఎన్నికలో కేవలం 64.72 శాతంగానే ఉంది. ఈ నియోజకవర్గంలో గ్రామగ్రామాన ప్రియాంక ప్రచారం నిర్వహించారు. పోలింగ్ రోజున మిగతా అభ్యర్థుల కంటే ఎక్కువ బూత్ లను సందర్శించారు. ఈ ఎన్నికలో ప్రియాంకతో కలిపి 16 మంది బరిలో నిలిచారు.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this