సోమవారం సాయంత్రం తొలిసారి లక్ష రూపాయలు దాటిన 10 గ్రాముల మేలిమి బంగారం…తాజాగా మంగళవారం మరో రూ.2 వేలు పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రూ.1,02,000కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే ఔన్సు బంగారం ధర (31.10 గ్రాములకు ) 3,467 డాలర్లు పలుకుతోంది.
సాధారణంగా అక్షయ తృతీయకు ఎంతోకొంత బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో…కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. బంగారం వర్తకుల్లోనూ…. ఇటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అక్షయ తృతీయ రోజు నాటికి అనగా ఏప్రిల్ 30 రోజునైనా… బంగారం కాస్త అయినా తగ్గుతుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇదేస్థాయిలో ధరలు కొనసాగితే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అనుకుంటున్నారు.