కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు… పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే… కర్కశత్వానికి ఒడిగడితే…ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు మొక్కెవరు . కనిపెంచిన అమ్మ తన చేతులతోనే …. ఇద్దరు కుమారులను వేట కొడవలితో నరికి చంపింది. ఆపై ఆరంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి గాజులరామారంలో గురువారం జరిగింది. పిల్లలకు శ్వాసకోశ ఇబ్బందులు, తనకు కంటి సమస్య ఉండడంతో మానసికంగా కుంగిపోయిన తల్లి ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో ఏడు పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గండ్ర వెంకటేశ్వర్‌రెడ్డి(38), తేజస్విని(33) దంపతులు గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ఉంటున్నారు. వీరి కుమారులు ఆశిష్‌రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(4)
వెంకటేశ్వర్‌రెడ్డి ఫార్మా ఉద్యోగి. తేజస్వినికి కొంతకాలంగా కంటిచూపు సమస్య ఉండడంతో మానసికంగా ఇబ్బంది పడుతోంది.
ఆశిష్, హర్షిత్ ఇద్దరికీ శ్వాసకోశ సమస్య ఉంది. ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి ముక్కుద్వారా చుక్కలు వేయాలి. లేకపోతే శ్వాస ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో భర్తతో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. గురువారం భర్త విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం పిల్లలు ఇంటికొచ్చారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలకు ఇదే చివరిరోజు కావడంతో…. వచ్చే సంవత్సరానికి పిల్లలకు కొన్ని పుస్తకాలు కూడా తెచ్చారు.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో…పిల్లల మీద విరుచుకుపడింది. వేటకొడవలితో పిల్లల తల, మెడ భాగంలో విచక్షణారహితంగా నరికింది. ఆశిష్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. తర్వాత తాము ఉండే అపార్టుమెంటు ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు తేజస్విని ఫ్లాటులోకి వెళ్లి చూసి.. కొన ఊపిరితో ఉన్న హర్షిత్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలోగా మరణించాడు. భార్య, పిల్లల మరణంతో వెంకటేశ్వర్‌రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఘటనా స్థలిలో తేజస్విని రాసిన లేఖ లభ్యమైంది. ‘పిల్లలకు నాలుగైదు గంటలకోసారి డ్రాప్స్(మందు) వేయకపోతే ఇబ్బంది పడతారు. మెరుగైన వైద్యానికి భర్త సహకరించడం లేదు. ఎంత ఆస్తి ఉన్నా.. పిల్లలకు పనికిరాకుండాపోతోంది. దీంతో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భర్త ఇంట్లో ఉన్న సమయంలో చికాకు, కోపంతో కసురుకుంటాడు. నా పరిస్థితి, పిల్లల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోంది.’అంటూ లేఖలో రాసింది.
పిల్లలు పుట్టినప్పటి నుండి పెరిగిపెద్దయ్యే వరకు… వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి…పోతుంటాయి…. అంతమాత్రాన పిల్లలను చంపుకుంటారా…? క్షణికావేశంలో చేసిన ఘాతుకమే అయితే.. లేఖ ముందగానే ఏలా రాసి పెడుతుంది. ఆ మాత్రం అనారోగ్యసమస్యలకే… కుంగిపోతే సమాజంలో ఎంత మంది ఎన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురికావడం లేదు…? ఇంత అసహనమా… ఓపికలేని తనమా… క్రూర మృగం కూడా… తన పిల్లలను తాను చంపుకోదు కదా…మృగానికంటే దారుణంగా ప్రవర్తించడమా…ఇది మానవజాతేనా…?