కారు డోర్ లాక్ కావడంతో…. ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది.
వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుమలతకు భాను(7), నీల(4) సంతానం. వెంకటసుబ్బారెడ్డి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లగా…సుమలత తన పిల్లలతోపాటు వెంకటసుబ్బారెడ్డి అన్న గంగయ్య, అతని భార్య, అల్లుడు గురువారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కారులో వచ్చారు . అలిపిరి వచ్చాక సుమలత, గంగయ్య భార్య కాలినడకన తిరుమలకు బయలుదేరగా…
గంగయ్య, ఇద్దరు పిల్లలు, అల్లుడు తిరుమలకు కారులో చేరుకుని… స్థానిక వరాహస్వామి అతిథిగృహం-1 పార్కింగ్ ఏరియాలో కారును పార్క్ చేశారు. దర్శనానికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పిల్లలను కారులోనే ఉంచి గంగయ్య, అతని అల్లుడు బయటకు వెళ్లారు.
డోర్లు లాక్ చేసుకుని వెళ్లడంతో…. కొంతసేపటికి కారులోని పిల్లలు ఊపిరాడక విలపించారు. ఇది గమనించిన ట్యాక్సీ డ్రైవర్లు తిరుమల ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో…. వెంటనే కారు అద్దాన్ని పగలగొట్టి చిన్నారులను తితిదే అశ్విని ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను ట్రాఫిక్ హోంగార్డు జయచంద్ర, పీఎస్‌జీ వెంకటేశ్‌లు వన్‌టౌన్ పోలీసులకు అప్పగించి, చిన్నారుల పెదనాన్న గంగయ్యపై ఫిర్యాదు చేశారు.
తన పిల్లలను రక్షించిన పోలీసులకు తల్లి సుమలత ధన్యవాదాలు తెలిపారు.
TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు
Published on