HomeTelanganaJAPAN: పెట్టుబడుల ఆకర్షణే...ధ్యేయంగా....జైకా తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

JAPAN: పెట్టుబడుల ఆకర్షణే…ధ్యేయంగా….జైకా తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

Published on

spot_img

తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకునేందుకూ… తెలంగాణ ప్రభుత్వం జపాన్ ఇంటర్ నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) తో చర్చలు జరిపింది. ఇందుకుగాను జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్ లో సమావేశం అయింది. ఈ సమావేశంలో… ముఖ్యమంత్రితో పాటు ఇతర ఉన్నత అధికారులు…. జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే…. మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని జైకాను కోరింది తెలంగాణ ప్రభుత్వం .

పెట్టుబడులను ఆకర్షించే విధంగా…తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు….ప్రపంచంలోనే…పెట్టుబడులను ఆకర్షించే గమ్యస్థానంగా….హైదరాబాద్ ను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టే మౌలిక సదుపాయాల ప్రజెక్ట్ ల గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వివరించారు.

తెలంగాణతో…(జైకా) కు అనేక ఏళ్ళ నుండి సంబంధాలున్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా అన్నారు. మెట్రో రైలు విస్తరణతో పాటు, అర్హతలున్న అన్ని ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు… కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this