గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో…. పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో….నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మల్లు రవి MSME ల గురించి చర్చించారు , ఇందులో పలు బ్యాంకులు, టాటా, ఓలా, బజాజ్, పి ఆర్ వి టి వంటి అనేక రకాల సంస్థలు పాల్గొన్నాయి.
నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో… నిరుద్యోగ వ్యవస్థ లేకుండా చేయడమే…ధ్యేయంగా పనిచేస్తున్నారు ఎంపీ మల్లు రవి. ఇందుకనుగుణంగా…ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు నడుంబిగించారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు, దీంతో పరిశ్రమలో ఉద్యోగాలు పొందాలనుకునే నిరుద్యోగులకు ఈ ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్’ను పైలెట్ ప్రాజెక్టు కింద…. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేయాలనే .. ప్రతిపాదనతో…. ‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్ మెంట్ ’యూనివర్సిటీ రిజిస్టర్ & ఓ ఎస్ డి చమన్ మోత గారికి …తన ప్రతినిధి ద్వారా వినతి పత్రాన్ని అందజేసారు ఎంపీ డాక్టర్ మల్లు రవి.