జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ… సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. విచారణ చేపట్టిన ధర్మాసనం…. దంపతులిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని…తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు
ప్రయత్నం చేయాలని ఆదేశించింది.
కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమైనందున …మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. ఇద్దరు కూర్చొని తమ మధ్య వివాదానికి కారణమైన అంశాలపై శాంతియుతంగా చర్చించుకోవాలి. మూడు వారాల్లోగా ఈ ప్రక్రియ ముగించాలి…… అని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది.