ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్ మరికొద్ది రోజుల్లో …. డ్రైవర్ లెస్ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో వీటి ట్రెండ్ నడుస్తున్న….వేళ ఈ సెగ్మెంట్‌లోకి వెళ్ళాలని చూస్తోంది. అందులో భాగంగానే… తన అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో కూడిన తొలి కారును 2027 ఆర్థిక సంవత్సరం నాటికి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని ‘ప్రోపైలట్ టెక్నాలజీ’గా నిస్సాన్ పేర్కొంటోంది.
వేవ్ AI డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌తో ఈ కారు నడుస్తుంది. ఈ ఏఐ డ్రైవర్ సాఫ్ట్‌వేర్ అత్యంత సంక్లిష్టమైన సమయంలోనూ మనిషిలా విధిని నిర్వహిస్తుందని నిస్సాన్ కంపెనీ పేర్కొంది.