– ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డ్రగ్స్ విషయమై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మార్చిందని, ఇదే ఇప్పుడు రాష్ట్రానికి పెనుముప్పుగా మారిందని ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ స్పందించి డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
“రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కొంతకాలం క్రితం విశాఖపట్నంలో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థలో తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.
గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందింది. నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. దీనికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం” అని జనసేనాని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Drugs have become a menace in the state. Another legacy issue our NDA govt inherited from previous corrupt and criminal regime. A special focus is needed to curb drug mafia, ganja cultivation and related criminal activities in the state.
Sometime back,seizure of a cocaine…— Pawan Kalyan (@PawanKalyan) November 9, 2024