ఇప్పటి వరకు షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో…ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సెంట్రల్ రైల్వే తొలిసారిగా ముంబయి-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్ లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ప్రతి రోజు నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో.. ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీనిని ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫిసర్ స్వప్నిల్ నీలా వెల్లడించారు. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దీనికి షట్టర్ డోర్‌ను కూడా అమర్చారు.
ప్రయోగాత్మకంగా… రైళ్లో ఏటీఎంలు ఏర్పాటు చేపడుతున్నప్పటికీ…వాటిని ఎంతమేరకు ప్రజలు ఉపయోగించుకుంటారు అనేది చూడాలి. ఇప్పుడు ఎవరైన స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ పేమెంటే… ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా ఆర్ టీ సీ బస్సుల్లో ఆన్ లైన్ పేమెంట్ ప్రవేశపెట్టారు. ఉన్నటువంటి ఏటీఎంలలోనే ఎక్కువ మంది డబ్బు డ్రా చేయడం లేదు. అలాంటప్పుడు రైళ్లో ఏటీఎంలు పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు