HomeTelanganaREVANTH REDDY: పార్టీ గీత దాటితే... వేటు తప్పదు: సీఎం

REVANTH REDDY: పార్టీ గీత దాటితే… వేటు తప్పదు: సీఎం

Published on

spot_img

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. పార్టీ నిర్ధేశించిన నియమాలకు అందరూ… కట్టుబడి ఉండాలని సీఎం అన్నారు. పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అని తేల్చి చెప్పారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలను కోరారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకోవలని కోరారు. రేపటి నుంచి జూన్‌ 2 వరకు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించాలి. నేను కూడా మే 1 నుంచి జూన్‌ 2 వరకు ప్రజలతో మమేకమవుతా అని తెలిపారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మి…. బుల్డోజర్లు పంపిస్తున్నారని ప్రధాని మాట్లాడుతున్నారు. భాజపా, భారాస కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయన్నారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్‌ ఉంటుంది. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణ మోడల్‌పై దేశంలో చర్చ జరుగుతోంది. సన్నబియ్యం మన పథకం.. మన పేటెంట్‌…. మన బ్రాండ్‌. భాజపా పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలి… అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this