HomeInternationalUSA: న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న... విదేశీ విద్యార్థులు

USA: న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న… విదేశీ విద్యార్థులు

Published on

spot_img

విదేశి విద్యార్తుల పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పడు ఏ నిర్ణయం తీసుకుంటాడో….తెలియని పరిస్థితి అక్కడి విద్యార్థుల్లో నెలకొని వుంది. కారణం ఏదైన విదేశి విద్యార్థులను బయటకు పంపడమే లక్ష్యంగా కనిపిస్తుంది. క్షణం క్షణం భయం గుప్పిట్లో బతుకుతున్నారు అక్కడి విదేశి విద్యార్థులు. తాజాగా ట్రంప్ యంత్రాంగం పలు యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. క్యాంపస్‌ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించినా…. ఆందోళనల్లో పాల్గొన్నా… జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వారికి ఈమెయిల్స్‌ పంపారు. దీంతో అక్కడి విద్యార్థులకు భయం మొదలైంది.

విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ…పలవురు విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు వల్ల తమ చదువులు మద్యలోనే ఆగిపోతాయని….తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సహా మేరీల్యాండ్, ఒహియో స్టేట్ వంటి ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలోని విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు వీరిలో ఉన్నారు.

చట్టబద్దమైన పత్రాలు లేని విద్యార్థులను, హమాస్‌ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్నప్పటికీ…నిరసన కార్యక్రమాలలో పాల్గొనని విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్లు కళాశాలలు పేర్కొంటున్నాయి. కొందరు విద్యార్థులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీసా రద్దు చేసినట్లు చెప్తుండగా..మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణాలు చూపడం లేదని…. కోర్టుకు విన్నవించారు. ఇటువంటి కారణాలతో తమ వీసాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this