హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేయగా…. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో…. నిందితుడి స్నేహితులు అతన్ని కలవాలని అనుకున్నారు. ఈ మేరకు నిబంధనలు అనుసరించి ములాఖత్ అనుమతి తీసుకున్నారు. జైలు లోపలికి వెళ్లి అతనితో మాట్లాడారు. అయితే వారంతా జైలు నిబంధనలు ఉల్లఘించి దొంగచాటుగా మొబైల్ ఫోన్ తీసుకెళ్లారు.
సరదాగా స్నేహితుడి(ఖైదీ)తో మాట్లాడుకుని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. జైలు ములాఖత్ గది వద్ద కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట నిఘా ఉన్నప్పటికీ వారంతా ఫోన్ ఎలా తీసుకెళ్లారంటూ …నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జైలు భద్రతా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.