HomeMoviesSAKHI: సఖి { 25 ఏళ్లు }

SAKHI: సఖి { 25 ఏళ్లు }

Published on

spot_img

ప్రేమ పెళ్ళికి దారితీస్తే….పెళ్ళి కలహానికి దారితీసింది. కలహానికి కారణం తెలిసింది. ఆ కారణమే…కలహాన్ని తరిమేసి…ప్రేమకు కొత్త రూపునిచ్చింది.
2000 సంవత్సరానికి… ముందు దర్శకుడు మణిరత్నం వరుస పరాజయాలతో ఏమితోచని స్థితిలో ఉన్న ఆయనకు…. మేఘాలలో తేలిపోమ్మన్నది సాంగ్‌ లెవల్‌లో ఓ ప్రేమ జంట బైక్‌పై వెళ్లడాన్ని తీక్షణంగా చూశారు. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కాని పెళ్లి అయ్యాకే అసలు కథ మొదలవుతుంది అన్న చిన్న ఆలోచనలో ఉన్నారు. ఈ పాయింట్‌తోనే సినిమా చేస్తే ఏలా వుంటుంది అనే ఆలోచనకు వచ్చిరు. రచయిత సుజాత (కలం పేరు)కు మనసులో మాట చెప్పగానే… ఆయన్నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కు రూపం దాల్చి… ఎవర్‌గ్రీన్‌ మూవీ స్టోరీకి బీజం పడింది.

మొదట స్క్రిప్టు ఓకే అయింది కానీ… హీరో- హీరోయిన్ల ఎంపికే సవాలుగా మారింది. మణిరత్నానికి కొందరు షారుక్‌ఖాన్‌ పేరు సూచించారు. పాపులర్‌ కాని యాక్టర్స్‌తో సినిమా చేయాలనేది డైరెక్టర్‌ ప్లాన్‌. ‘ఇద్దరు’ సినిమాలోని ఓ పాత్ర కోసం లుక్‌ టెస్ట్ చేసి మరీ ‘సరిపోడు’ అంటూ నో చెప్పిన మాధవన్‌నే హీరోగా తీసుకోవాలని ఫిక్స్‌ అయ్యారు. తొలి ప్రయత్నంలో నిరాశ ఎదురైనా.. తర్వాత అలా హీరోగా ఎంపికయ్యారు మాధవన్‌, గాయని వసుంధరా దాస్‌ను హీరోయిన్‌గా స్క్రీన్‌ టెస్ట్‌ చేసినా.. ఇంకా చలాకీగా ఉంటే బాగుంటుందనుకుని ఆమెను తిరస్కరించారు. ఓ సినిమాలోని షాలిని నటన నచ్చిన మణిరత్నం.. ఆమెను తన మూవీలో హీరోయిన్‌గా తీసుకున్నారు.

హీరోయిన్‌ అక్క పాత్రధారిని పెళ్లి చూపులు చూసేందుకు వచ్చే పాత్ర కోసం విక్రమ్‌ను అడిగారు. పాత్ర నిడివి తక్కువ కారణంగా విక్రమ్‌ నో చెప్పారట. అరవింద్‌స్వామి పోషించిన అతిథి పాత్ర కోసం ముందుగా అనుకున్న జాబితాలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ పేర్లూ ఉన్నాయి.

సినిమాకి అందించిన ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు శ్రోతలను ఎంతగానో…కట్టిపడేశాయి. ‘పచ్చందనమే’‘స్నేహితుడా’. ఇలా దేనికదే ప్రత్యేకమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోఅక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ గురించి ప్రస్తావించిన తొలి సినిమాగా నిలిచిన ‘సఖి’మాధవన్‌ కెరీర్‌ని మార్చేసింది.

ఈ సినిమాకి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి …. ప్రేమికుల మదిలోని మనసును తొలిచే…కొన్ని చిత్రాలు మాత్రేమే ఎప్పటికీ స్థిరస్థాయిగా..
నిలిచిపోతాయి అనడానికీ ఎలాంటి అతిశయోక్తి లేదు.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this