అంబేడ్కర్ జయంతి సందర్భంగా… సీఎం చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఆయన పర్యటించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేడ్కర్ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన పార్టీ తెదేపా అని తెలిపారు. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చాం. సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారన్నారు.
ప్రతిష్ఠాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయి. సబ్‌ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వారికి 8 లక్షల ఎకరాలను తెదేపా ప్రభుత్వం గతంలో పంపిణీ చేసింది… అని చంద్రబాబు గుర్తుచేశారు. .