HomeInternationalCHINA: ఇంజనీరింగ్ అద్బుతం

CHINA: ఇంజనీరింగ్ అద్బుతం

Published on

spot_img

గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… చైనా మరోసారి ఇంజినీరింగ్‌ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించి వారెవ్వా అనిపించుకుంది. ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం…. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ వంతెన నిర్మాణంతో గంట సమయం పట్టే ప్రయాణాన్ని నిమిషంలోనే పూర్తి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్‌ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ ‘హువాజియాంగ్‌ గ్రాండ్ కెన్యాన్‌ బ్రిడ్జి’ని నిర్మించారు. 2022లో నిర్మాణాన్ని ప్రారంభించి కేవలం మూడేళ్లలోపే పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ కోసం 280 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసారు. ఈఫిల్‌ టవర్‌ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ ఏడాది జూన్‌లోని ఈ వంతెనను ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యటక ప్రాంతంగానూ ఈ వంతెన నిలవనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఇలాంటి భారీ వంతెన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం ఈ దేశంలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Latest articles

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

REVANTH REDDY: పార్టీ గీత దాటితే… వేటు తప్పదు: సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. పార్టీ నిర్ధేశించిన నియమాలకు...

More like this