HomeAndhra PradeshVIJAYAWADA: మతసామరస్యం కోరుతూ.....ఏప్రిల్ 13 న సమైఖ్యతా శంఖారావం

VIJAYAWADA: మతసామరస్యం కోరుతూ…..ఏప్రిల్ 13 న సమైఖ్యతా శంఖారావం

Published on

spot_img

భిన్నమతాలు, జాతులు, భాషలు, వర్గాలు , సంస్కృతుల సమాహారంగా ఉన్న మనదేశంలో… ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా…
ఘర్షణలు సృష్టించే విధంగా.. పాలక భాజపా, ఆరెస్సెస్ వంటి శక్తులు కుట్రలు చేస్తున్నాయని… అలాంటి వాటికి ఇకపై ఆస్కారం లేని విధంగా, లౌకిక రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించాలని కోరుతూ… సొసైటీ ఫర్ కమ్యునల్ హార్మనీ, పలు సంఘాల ఆద్వర్యంలో ఈ నెల 13 న విజయవాడ నగరంలోని సిద్ధార్థ అకాడెమీ ఆడిటోరియం నందు సమైక్యతా శంఖారావం సదస్సు నిర్వహించనుంది. నిర్వహణ జాతీయ కమిటీ చైర్మన్
కే విజయరావు , రాష్ర్ట సమన్వయ కర్త మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక బాలోత్సవ భవన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గోడ పత్రిక ను ఆవిష్కరించారు.

వడ్డే మాట్లాడుతూ… 1947 చట్టం ప్రకారం చారిత్రక కట్టడాలు దేవాలయాలు మసీదులు చర్చిలు విషయంలో ఎలాంటి జోక్యం ఉండరాదని తెలిపారు. అలాగే బాబ్రీ మసీదు ధ్వంసం తర్వాత 1991 చట్టం ప్రకారం మత ఘర్షణలకు దారితీసే ఎలాంటి చర్యలు ఉండకూడదని అన్నారు. . అయినప్పటికీ దేశంలో పాలక బిజెపి మైనారిటీ మతాల పట్ల ఘర్షణలు లేవనెత్తి తన ఆరెస్సెస్ అజెండాను అమలుచేస్తు ఉన్నారని అన్నారు. వందేళ్ళ క్రితమే వివేకానంద చికాగో లో మన దేశ ఔన్నత్యం మీద ప్రసంగించిన సంగతి వివరించారు. ప్రజల అందరి ఆమోదం లేకుండా వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్ లో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.

విజయ రావు మాట్లాడుతూ…. సొసైటీ ఫర్ కమ్యునల్ హార్మొనీ జాతీయ స్థాయిలో మత సామరస్యం కోసం కృషి చేస్తూ ఉందని అన్నారు. 13 న జరిగే సదస్సులో రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గడి, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యూ పి మాజీ మంత్రి మోయిద్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అజీజ్ పాషా,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తదితరులు వక్తలుగా పాల్గొంటున్నారని వివరించారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్ బాబురావు మాట్లాడుతూ… ఇటీవల వివిధ రకాల శంఖారావాల పేరుతో నానా యాగి చేశారని, పాలకులే మతం, భక్తి పేరుతో రోజుకో మాటలు చెప్తూ ఉన్నారని వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సదస్సు జరుగుతుందని అన్నారు.
కార్యక్రమంలో మైనారిటీ హక్కుల రాష్ర్ట కన్వీనర్ షేక్ బాజీ , సీనియర్ న్యాయవాది మతీన్, సొసైటీ ఫర్ కమ్యునల్ హార్మనీ కార్యదర్శి అబ్దుల్ రహేమన్, వై కేశవరావు( రైతు సంఘం) కే శ్రీదేవి (ఐద్వా) అనిల్ (ప్రజానాట్యమండలి), సూర్యారావు (డి వై ఎఫ్ ఐ) మోతుకూరి అరుణకుమార్ (అరసం) కే శ్రీనివాసరావు (జే వివి) రపి అహ్మద్ , సలాముద్ధిన్, కె .ఉమామహేశ్వర రావు( citu) తదితరులు పాల్గొన్నారు.

 

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...