గత కొద్ది రోజుల నుండి… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశీయ మార్కెట్లు ఊగిసలాటలో వున్నాయి. పలు దేశాలపై టారిఫ్ విరామ ప్రకటన, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాల ఎఫెక్ట్ మన సూచీలపై కనిపించింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో రోజును ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,165 పాయింట్లు పుంజుకొని 75,012 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 375 పాయింట్లు ఎగబాకి 22,774 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 51 పైసలు పెరిగి, 86.18 వద్ద కదలాడింది. మదుపరులు మంచి లాభాలను అర్జించారు.