రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల వ్యవధిలో నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం వుందని తెలిపింది. మరోవైపు మంగళ, బుధ వారాల్లో పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. 48 గంటల వ్యవధిలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బిహార్ నుంచి ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు.