HomeAndhra PradeshY.S.Jagan: యూనిఫాం ఊడదీసి ఉద్యోగాల్లేకుండా చేస్తా..!

Y.S.Jagan: యూనిఫాం ఊడదీసి ఉద్యోగాల్లేకుండా చేస్తా..!

Published on

spot_img

* చంద్రబాబు అధర్మానికి సెల్యూట్ చేసే పోలీసులను చట్టం ముందు దోషులుగా నిలబెడుతా!

* రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో జగన్ తీవ్ర వ్యాఖ్యలు

* చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపాటు

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఇవాళ పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బట్టలూడదీసి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫామ్ ఊడదీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

లింగమయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని… రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు కలిగిందని, 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాల్లో వైసీపీ గెలుపొందిందని చెప్పారు. టీడీపీకి బలం లేకపోయినా ఎన్నికల్లో నిలుస్తోందని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా ఉన్నాననే అహంకారంతో చంద్రబాబు ఉన్నారని, నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని జగన్ మండిపడ్డారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలేనని జగన్ ఆరోపించారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this