HomeTelanganaHCU: హెచ్ సీ యూ భూములు విషయంలో ...ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

HCU: హెచ్ సీ యూ భూములు విషయంలో …ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

Published on

spot_img

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా …ప్రభుత్వం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. హెచ్ సీ యూ భూముల విషయంలో… విద్యార్థులతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం నడుకట్టింది. అలాగే విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. వర్సిటీ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకోనుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, విశ్వవిద్యాలయం అధ్యాపకసంఘం ప్రతినిధులు, సివిల్‌ సొసైటీ ప్రతినిధులతో సోమవారం మంత్రుల కమిటీ చర్చించిన అనంతరం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. బలగాల ఉపసంహరణపై వీసీ అభిప్రాయం కోరుతూ లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ఆదివారం హెచ్‌సీయూ విద్యార్థులు, అధ్యాపకులు, సివిల్‌ సొసైటీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన మీనాక్షి నటరాజన్‌.. సోమవారం మంత్రుల కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబులతో సమావేశమయ్యారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి, అధ్యాపక సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్‌ భూక్యానాయక్, ప్రొఫెసర్‌ సౌమ్య దేచమ్మ, ప్రొఫెసర్‌ శ్రీపర్ణదాస్, వివిధ సంఘాల ప్రతినిధులు సంధ్య, సజయ, విస్సా కిరణ్‌కుమార్, ఇమ్రాన్‌ సిద్దిఖీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున, భూముల నేపథ్యంపై కాకుండా….. విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారంపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు. విద్యార్థులు, అధ్యాపకులు తన వద్ద ప్రస్తావించిన అంశాలను మీనాక్షి నటరాజన్‌ వివరించారు. దీంతో మంత్రుల కమిటీ వెంటనే నిఘా విభాగం డీజీ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తదితరులను పిలిపించి.. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసు భద్రత కావాలని వర్సిటీనే కోరినందున వీసీ అభిప్రాయం తెలుసుకుని బలగాల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

సుప్రీంకోర్టు సాధికార కమిటీ.. వర్సిటీ క్యాంపస్‌ను సందర్శించడానికి ముందే 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టం అంచనా, జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతివ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు. కానీ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయస్థానం తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఎవరినీ సర్వేకు అనుమతించలేమని… మంత్రుల కమిటీ స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం.. 400 ఎకరాల భూమి పరిరక్షణకు పోలీసుల పహారా తప్పనిసరని, క్యాంపస్‌లోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న బలగాలను.. వీసీ స్పందన అనంతరం ఉపసంహరించుకుంటామంది.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...