HomeTelanganaTGSRTC Conductor: ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్

TGSRTC Conductor: ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్

Published on

spot_img

హైదరాబాద్: ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల హైట్ తో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అతడికి ఆర్టీసీ డిపార్ట్ మెంలో వేరే ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ లో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతడికి వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ఆదేశించారు పొన్నం.

అమీన్ అహ్మద్ అన్సారీ హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహీనగర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి మెహిదీపట్నం డిపోలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్ గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది.

195 సెం.మీ.(6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సూచించారు. ఈ క్రమంలోనే అతడికి వేరే ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this