HomeAndhra PradeshAP Home minister: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన అనిత

AP Home minister: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన అనిత

Published on

spot_img

* డిప్యూటీ సీఎంతో క్లారిటీగా మాట్లాడినట్లు వెల్లడి

* గతంలో నేరాలను ప్రోత్సహించడం వల్లే ఇప్పుడీ పరిస్థితి అంటూ ఆవేదన

ఏపీలో జరుగుతున్న నేరాల విషయంలో అందరం బాధపడుతున్నామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ విషయంలో పవన్ కల్యాణ్ బయటపడ్డారు.. మేం పడలేదు.. అంతే తేడా అని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన అనిత… ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో క్లారిటీగా మాట్లాడానని, సోమవారం పవన్ మాట్లాడిన మాటలను పాజిటివ్ గా తీసుకుంటానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ మేరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలపై చర్చించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నేరాలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్‌ జరగడం బాధాకరమని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించడమే ఇప్పుడీ పరిస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులకు వెంటనే శిక్షలు విధించి, అమలు చేయడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అనిత చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. జగన్ కు భావప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లుందని, గత ప్రభుత్వ హయాంలోనూ పోలీసులు ఇబ్బంది పడ్డ విషయం మాత్రం గుర్తులేదని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this