లండన్ నుంచి ముంబయికి రావాల్సిన విమానం టర్కీ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దాంతో అక్కడి మారుమూల విమానాశ్రయంలో బుధవారం రాత్రి నుంచి 200 మంది భారత ప్రయాణికులు చిక్కుకుపోయారు.
లండన్ నుంచి వర్జిన్ అట్లాంటిక్ విమానం ముంబయికి బయలుదేరింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తుర్కియేలోని మారుమూల ప్రాంతమైన దియార్‌బకిర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ప్రయాణికులకు చెప్పారు. దాదాపు 20 గంటల నుండి ప్రయాణికులు అక్కడే ఉన్నారు. వారిలో 200 మందికిపైగా భారతీయులున్నట్లు తెలుస్తుంది. తిరిగి వారు ఎప్పుడు గమ్యస్థానానికి చేరతారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి విమానయాన సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సాధ్యమైనంత త్వరగా రవాణా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. తమకు విమానాశ్రయంలో తగిన సౌకర్యాలు లేవని…అది మిలిటరీ బేస్ కావడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి కూడా అవకాశం లేదని తెలిపారు.