* అమీన్ పూర్ లో ఓ తల్లి ఘాతుకం
* ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్న ఓ తల్లి ఆమె ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపేసింది. పోలీసుల విచారణలో బయటపడిన వాస్తవాలు పరిశీలిస్తే… రాఘవేంద్ర కాలనీకి చెందిన రజిత (45) అనే మహిళకు భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లలు.. సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(8) ఉన్నారు. ఇటీవల టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో తన పాత స్నేహితుడితో రజితకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతే.. భర్త, పిల్లలను వదిలించుకుని ప్రియుడితో శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది.
మార్చి 27వ తేదీ రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగు అన్నంలో విషం కలిపింది. అయితే, ఆ అన్నం తినకుండా భర్త వాటర్ ట్యాంకు తీసుకుని కాలనీలో వాటర్ సప్లై చేసేందుకు వెళ్లిపోయాడు.దీంతో ఆ పెరుగు అన్నం ముగ్గురు పిల్లలకు పెట్టింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త చెన్నయ్య ఇంటికి వచ్చే సరికి ముగ్గురు పిల్లలూ విగత జీవులుగా పడివున్నారు. కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు.
ఈ వ్యవహారంలో మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు… మరింత లోతుగా కేసు విచారణ జరిపితే రజిత భాగోతం బయటపడింది. దీంతో రజిత ప్రియుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి మోజులో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపేసిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపింది.
ప్రియుడితో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన 45 ఏండ్ల తల్లి
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన ఘటనలో సంచలన విషయాలు
వివాహేతర సంబంధం కారణంగా పిల్లలని చంపేయాలని ప్లాన్ చేసిన రజిత(45)
ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్… https://t.co/YOVgOlcpGs pic.twitter.com/JOvoGkbyCn
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2025