డిజిటల్ రంగంలో… సాంకేతిక పరిజ్ణానంతో అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంటే… మరో వైపు రాష్ట్రంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కువగా ఉన్నత ఉద్యోగులే వీటి బారిన పడి సొమ్మును పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ నేరాలను కట్టడి చేయడానకి బాధితుల నుండి వివరాల్ని సేకరించి , విశ్లేషించిన పోలీసు శాఖ ఇటీవల ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఇందులో ఆంట్రప్రెన్యూనర్లతో పాటు వైద్యుల, వృత్తి నిపుణులూ సైబర్ నేరాలకు బాధితులుగా మారుతున్నట్లు తేలింది. కొరియర్‌లో మాదకద్రవ్యాలు, ఆయుధాలు ఉన్నాయంటూ బెదిరింపులు. యూపీఐ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మోసాలు, ఫిషింగ్, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు, ఈ-కేవైసీల పేరిట, న్యూడ్ వీడియో కాల్స్ వంటి మోసాల బారిన పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గత 8 నెలల్లో 1,833 సైబర్ కేసులు నమోదవగా …రూ.633.13 కోట్లు పోగొట్టుకున్నారు. వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే అధికరం.