HomeAndhra PradeshSUPREME COURT: రఘురామ కేసులో ప్రభావతి దర్యాప్తునకు హాజరుకావాలి: సుప్రీంకోర్టు ఆదేశం

SUPREME COURT: రఘురామ కేసులో ప్రభావతి దర్యాప్తునకు హాజరుకావాలి: సుప్రీంకోర్టు ఆదేశం

Published on

spot_img

మాజీ ఎంపీ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పై కస్టోడియల్‌ టార్చర్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతి దర్యాప్తునకు తప్పక సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైకాపా అధికారంలో ఉండగా గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఆమె పనిచేశారు. రఘురామపై కస్టోడియల్‌ టార్చర్‌లో ఎలాంటి గాయాలు కాలేదని అప్పట్లో నివేదిక ఇచ్చారు.

ఈ అంశం పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 7,8 తేదీల్లో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలని… ప్రభావతిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తునకు సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఒక్కసారే విచారణకు పిలిచారని.. రెండు నెలల్లో మళ్లీ పిలవలేదని ప్రభావతి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎప్పుడు నోటీసులు పంపినా.. ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this