ఓదెల 2… ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నటి తమన్నా . ఈ సినిమా సరికొత్త ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం సాయంత్రం ముంబయిలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమన్నాతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది. ఇందులోభాగంగా ఓ విలేకరి.. ‘‘మంత్రాలు, తంత్రాలు ఉపయోగించి మీరు ఎవరిమీదనైనా విజయం (హిందీలో విజయ్) సాధించాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించింది. దీనిపై తమన్నా స్పందిస్తూ.. ‘‘మంత్ర, తంత్రాలతో అలాంటిది జరుగుతుందంటే నేను నమ్మను. ఒకవేళ అదే నిజమైతే మీ (మీడియా)పై ప్రయోగిస్తా. అందరూ నా చేతుల్లో ఉంటారు. నేను చెప్పింది వింటారు. నేను ఏం చెబితే అదే రాసుకుంటారు’’ అని ఆమె సరదాగా బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్ పేరు ప్రస్తావించడానికి కూడా తమన్నా ఇష్టం చూపించడం లేదని అందరు అనుకుంటున్నారు.
అనంతరం ఆధ్యాత్మిక జీవనం గురించి తమన్నా మాట్లాడారు. ‘‘జీవితంలో మనకు ఎలాంటి సమస్య ఎదురైనా దానినుంచి బయట పడేందుకు ఎదుటి వ్యక్తులపై ఆధారపడాలనుకుంటాం. ఆవిధంగా వారి నుంచి మనం సపోర్ట్ పొందుతాం. కానీ, ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఒక విషయాన్ని నేర్చుకున్నా…. ఆనందం లేదా బాధ మన చేతుల్లోనే ఉండాలి. ప్రశ్న ఏదైనా లోతుగా ఆలోచిస్తే… సమాధానం కూడా దొరుకుతుంది’’ అని ఆమె చెప్పారు.